
Photo Courtesy: BCCI
ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ దిగ్గజాలు ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ తమ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో వారు ఏడుగురు భారత ప్లేయర్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటిచ్చారు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.
🚨 G.O.A.T #IPL XI alert 🚨@gilly381 & @7polly7 build their best #IPL XI, right here#IPL2025 #ViratKohli #MSDhoni @myvoltas pic.twitter.com/NolGsfGAZ8
— Cricbuzz (@cricbuzz) May 6, 2025
ఈ జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లిని ఎంపిక చేశారు. విదేశీ ప్లేయర్ల ఎంపికలో గిల్‌క్రిస్ట్ క్రిస్ గేల్ పేరు ప్రతిపాదించగా.. పొలాక్ ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. ఏబీడి ఆధునిక టీ20 బ్యాటింగ్‌కు ఆధ్యుడని పొలాక్ ప్రశంసించాడు. మిగిలిన రెండు విదేశీ ఆటగాళ్ల బెర్త్‌ల కోసం గిల్‌క్రిస్ట్, పొలాక్ కలిసి లసిత్ మలింగ, సునీల్ నరైన్ పేర్లను ప్రతిపాదించారు. బౌలింగ్ ఎరీనాలో మలింగ 'గోట్' అని పొలాక్ కీర్తించాడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ కంటే సునీల్ నరైనే మోస్ట్ వ్యాల్యుయబుల్ ప్లేయర్ అని పొలాక్ అభిప్రాయపడ్డాడు.
వన్‌డౌన్‌లో బ్యాటింగ్ కోసం గిల్‌క్రిస్ట్, పొలాక్ కలిసి సురేశ్ రైనాను ఎంపిక చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఏబీడిని ఎంచుకున్నారు. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఆరో స్థానంలో ఎంఎస్ ధోని, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, సునీల్ నరైన్‌ను ఎంపిక చేశారు. పేస్ బౌలర్లుగా మలింగ, బుమ్రా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చహల్‌ను ఎంపిక చేశారు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ కలిసి ఎంపిక చేసిన ఐపీఎల్ ఆల్ టైమ్ XI: క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోని (కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.