Sachin-Surya: క్రికెట్‌ దేవుడితో 'రోలెక్స్‌'.. ఫోటో వైరల్‌

Actor Suriya Poses With Legendary-Sachin Tendulkar-PIC-Goes Viral - Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య అంటే తెలియని వారుండరు. స్టార్‌ ఇమేజ్‌ అనే చట్రంలో ఇరుక్కోకుండా విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది విడుదలైన కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' సినిమాలో 'రోలెక్స్‌' పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందరిని అలరించాడు. కేవలం నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఉండే ఆ పాత్ర విక్రమ్‌ సినిమాలో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసింది. సూర్య అంటే రోలెక్స్‌.. రోలెక్స్‌ అంటే సూర్య అనేలాగా విలనిజానికి కొత్త అర్థం చెబుతూ తన నటనతో అభిమానులను భయపెట్టాడు.

తాజాగా సూర్య.. టీమిండియా దిగ్గజ క్రికెటర్‌.. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. గౌరవం, ప్రేమ @ సచిన్‌ టెండూల్కర్‌ అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. అయితే సూర్య సచిన్ తో ఎప్పుడు ఎక్కడ ఫొటో దిగాడనేది మాత్రం తెలియదు. అయితే సూర్య సచిన్ తో ఎప్పుడు ఎక్కడ ఫొటో దిగారనేది మాత్రం తెలియలేదు. సూర్య షేర్‌ చేసిన ఫోటోపై అభిమానులు స్పందించారు. ''Goat ఆఫ్‌ సినిమా/క్రికెట్‌'.. ''ఒకేచోట ఇద్దరు మాస్టర్‌ బ్లాస్టర్స్‌''.. ''ఒక పక్క జాతీయ అవార్డు గెలిచిన విజేత.. మరోపక్క అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్రికెటర్‌''.. ''ఇద్దరు దిగ్గజాలు ఎదురుపడిన వేళ'' అంటూ కామెంట్స్‌ జత చేశారు.

ఇదిలా ఉండగా రీసెంట్ గా సచిన్, హైదరాబాద్ లో జరిగిన రేసింగ్ చూసేందుకు వచ్చాడు. మరోవైపు సూర్య, తన 42వ సినిమాతో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.

చదవండి: వందో టెస్ట్‌కు ముందు మనసులో మాట బయటపెట్టిన పుజారా

స్టార్‌​ కమెడియన్‌ యోగిబాబుకు ధోని గిఫ్ట్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top