ఫ్రెండ్స్.. మీకో విషయం తెలుసా..? Instagramలో సబ్‌స్క్రిప్షన్ అనే ఫీచర్‌తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా సంవత్సరానికి 12 కోట్లు. ఇది వినగానే మీలో చాలా మందికి.. అబ్బా.. నాకూ అకౌంట్ ఉంది.. నేను కూడా స్టార్ట్ చేస్తా, ఆ టాలెంట్ ఏదో నేర్చేసుకుంటా.. అని అనిపిస్తోంది కదా..? కానీ ఒక్క నిమిషమాగండి. ఆ టాలెంట్ మీరు నేర్చుకోలేరు, నేను నేర్పించలేను. ఎందుకంటే అది ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు.. అదో రకమైన టాలెంట్, అది అందరికీ రాదు, అందరూ చేయకూడదు కూడా.
హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది. దురదృష్టవశాత్తూ.. మన ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఫీచర్‌ని చాలా రాంగ్ దారిలో వాడుతున్నారు. అసలేం జరుగుతోంది..? దీనిపై ఎందుకు ఇంత వ్యతిరేకత..? అనేవి వివరంగా మాట్లాడుకుందాం.
అసలు ఈ కోటి రూపాయల గోలేంటి..? కేరళకు చెందిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్.. తన పేరు అశ్విని, Instagramలో పర్పుల్ సెలా అని ఉంటుంది.. ఆ అమ్మాయికి ఉన్నది కేవలం 2-3 లక్షల ఫాలోవర్లే. కానీ.. సబ్‌స్క్రైబర్లు మాత్రం 26 వేల మందే. వీరంతా ఒక్కొక్కరు నెలకు 399 రూపాయలు పే చేస్తున్నారు. ఇలా లెక్కేస్తే నెలకు కోటి రూపాయల పైనే ఈ అమ్మాయి సంపాదిస్తోంది. హిందీ క్రియేటర్లని కూడా దాటి ఈమె ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్‌కి వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా గత 4-5 నెలలుగా విష్ణుప్రియ, సాధన నాయుడు లాంటి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు Twitterలో వీళ్ళ ఫోటోలే ట్రెండింగ్. మరి.. ఏంటా ఫోటోలు? ఏమున్నాయి అందులో? అన్నీ ఆనిముత్యాలే. బాహాటంగా ఎక్స్‌పోజింగ్ చేస్తూ యూత్ ని ఆకర్షించడమే వీరి పని.
అసలు Instagram ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ఎందుకొచ్చింది..? అంటే నిజానికి ఇది YouTube మానిటైజేషన్ లాంటిది. క్రియేటర్లకి డైరెక్ట్ ఆదాయం ఉండదు కాబట్టి, వాళ్ళ స్పెషల్ టాలెంట్‌ని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకు.. ఒక బిజినెస్ పర్సన్ తన ప్రీమియం డిజైన్లు చూపించడానికి.. ఒక CA లేదా లాయర్ తన క్రిటికల్ లీగల్ టిప్స్ చెప్పడానికి.. ఒక ఫోటోగ్రాఫర్ తన సీక్రెట్ సెట్టింగ్స్ నేర్పించడానికి.. లేదా ఒక డాన్సర్ తన ఎక్స్‌క్లూజివ్ స్టెప్స్ నేర్పించడానికి.. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి..? టాలెంట్‌ని పక్కన పెట్టి, బాడీని చూపిస్తూ మనీ సంపాదిస్తున్నారు. ఎంతో మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడితే నెలకి లక్ష రావడం కష్టంగా ఉంటే, వీళ్ళు ఇలాంటి కంటెంట్‌తో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా కోపం, ఆవేదన రావడం సహజం.
ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. మన పేరెంట్స్ చిన్నప్పుడు కష్టపడి కాయగూరలమ్మినా, కూలి పని చేసినా మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అది కష్టం, అది నీతి. కానీ వీళ్ళు రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు..? మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే.. Instagramలో సబ్‌స్క్రిప్షన్ పెట్టి ఇగో ఇలాంటి ఫోటోలు అమ్ముతుంది.. అని గర్వంగా చెప్పుకోగలరా..? మై బాడీ మై విష్ అని కొందరు వాదిస్తారు. లీగల్‌గా ఇది కరెక్టే కావచ్చు.. కానీ ఎథికల్‌గా ఏం సమాధానం చెబుతారు. ఇలాంటివి చూసి కాలేజీ పిల్లలు, హౌస్ వైఫ్స్ కూడా మనీ ఇంత ఈజీగా వస్తుందా అని తప్పుడుదారిలో ఇన్‌స్పైర్ అవుతున్నారు. దీనివల్ల యూత్ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా..? ఒక ఫోటో చూడటానికెళ్లి గంటల కొద్దీ అందులోనే మునిగిపోతున్నారు. రాబోయే కాలం ఒక యుద్ధభూమి. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే స్కిల్ కావాలి కానీ, ఇలాంటి వ్యసనాలు కాదు.
మీకు అలాంటి కంటెంట్ చూపించాలనే ఉంటే.. దానికి ఓన్లీ ఫ్యాన్స్ లాంటి డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి, అక్కడికెళ్ళండి. Instagram అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర్నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉంటారు. దీన్ని ఇలాంటి చెత్తతో నింపేయొద్దు. తల్లిదండ్రులకు కూడా ఓ సజిషన్.. మీ పిల్లల ఫోన్లలో Instagram, Telegram యాప్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. వాళ్ళు ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో చూడండి. చెడిపోవడానికి వంద దారులున్నాయిక్కడ, జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చివరిగా.. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, ఎలా సంపాదిస్తున్నారు అన్నదే ముఖ్యం. అభిమానుల పేరుతో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదా అని. దట్సాల్.


