సుందర రహదారులుగా తీర్చిదిద్దుదాం | - | Sakshi
Sakshi News home page

సుందర రహదారులుగా తీర్చిదిద్దుదాం

Oct 7 2026 9:20 AM | Updated on Oct 7 2026 9:20 AM

ఎంపీ రఘునందన్‌ రావు

ఎంపీ రఘునందన్‌ రావు

మిరుదొడ్డి(దుబ్బాక): జీవకోటికి ప్రాణ వాయువులను అందించే మొక్కలను రహదారుల కిరువైపులా నాటి సుందర రహదారులుగా తీర్చ దిద్దాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు. జాతీయ రహదారిపై సేవా సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎల్కతుర్తి, సిద్దిపేట, మెదక్‌ జాతీయ రహదారిలోని అక్బర్‌పేట, ధర్మారంలోని రహదారికిరువైపులా బీజేపీ శ్రేణులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి పొడవునా జీడి మామిడితో పాటు, రకరకాల పండ్ల మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. పచ్చని రహదారులుగా తీర్చి ద్దిడానికి పాలకులు, అధికారులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement