పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: రాబోయే దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ధ్యేయంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. బాణాసంచ దుకాణాల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ఈనెల 20లోపు సీపీ కార్యాలయంలో సమర్పించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా ఏర్పాటు చేసే అనధికార దుకాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
దాండియా, సాంస్కృతిక వేడుకలకూ..
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించే దాండియా, ఇతర సాంస్కృతిక వేడుకలకు సంబంధించి నిర్వాహకులు పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. వేడుకలు జరిగే ప్రదేశాల్లో మహిళలు, పిల్లల భద్రతకు ప్రథమ ప్రాధాన్యాత ఇవ్వాలన్నారు.


