నేటికీ అందని పూర్తిస్థాయి యూనిఫాంలు | - | Sakshi
Sakshi News home page

నేటికీ అందని పూర్తిస్థాయి యూనిఫాంలు

Oct 7 2026 9:14 AM | Updated on Oct 7 2026 9:14 AM

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 12 వేల మంది విద్యార్థులకు అందని యూనిఫాం ఫ్యాంట్‌ వస్తే.. టాప్‌ రాలేదు పట్టించుకోని విద్యాశాఖ

న్యూస్‌రీల్‌

పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు

పాతదుస్తులతోనే విద్యార్థుల హాజరు

జిల్లా వ్యాప్తంగా 12 వేల మందికి

అందని యూనిఫాంలు

పట్టించుకోని విద్యాశాఖ

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

అడ్రెస్‌ లేని

ఏకరూపం!

లచ్చపేట మోడల్‌ స్కూల్‌కు సరిపడా యూనిఫాంలు రాకపోవడంతో ఎవరికీ ఇవ్వకుండా పక్కన పడేశారు. దుబ్బాక మండలం లచ్చపేట మోడల్‌ స్కూల్‌లో 6 నుంచి 10వ తరగతి వరకు 501 మంది విద్యార్థులున్నారు. యూనిఫామ్‌లు ఇప్పటివరకు బాలురలకు ప్యాంట్లు 194, షర్టులు 87, బాలికలకు ప్యాంట్లు 360 వచ్చాయి. పూర్తిస్థాయిలో యూనిఫాంలు రాలేదని విద్యార్థులకు అందజేయలేదు. ఈ సంవత్సరం యూనిఫాంలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు పాత యూనిఫాంలతోనే హాజరవుతున్నారు. కొందరు సాధారణ దుస్తులతో పాఠశాలకు వస్తున్నారు.

ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌లో కొత్త యూనిఫాంలు ఇవ్వకపోవడంతో పాత యూనిఫాంలతోనే విద్యార్థులు హాజరవుతున్నారు. చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌లో 460 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో బాలురు 180, బాలికలు 280 మంది ఉన్నారు. ఈ ఏడాది ఒక్కరికి సైతం యూనిఫాం ఇవ్వలేదు. దీంతో పాత యూనిఫాంలతోనే విద్యార్థులు పాఠశాలకు హాజరువుతుండటం గమనార్హం.

సాక్షి, సిద్దిపేట

నేటి విద్యార్థులలే రేపటి భవిష్యత్తు.. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ ఏక రూప దుస్తులు ధరించడం వలన మరింత క్రమశిక్షణ పెరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా రెండు స్కూల్‌ యూనిఫాంలను ప్రభుత్వం అందజేస్తోంది. 2026–27 విద్యా సంవత్సరం కొత్త యూనిఫాంను ఎంపిక చేశారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమై దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫాంలు అందలేదు. కొన్ని పాఠశాలల్లో ఒక్క జత సైతం రాలేదు. మరికొన్ని పాఠశాలలో బాలికలకు టాప్‌లు వస్తే ప్యాంట్లు రాలేదు. ప్యాంట్లు వస్తే టాప్‌లు రాలేదు. దీంతో పలువురు సాధారణ దుస్తులతోనే పాఠశాలకు వస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 938 ప్రభుత్వ విద్యాసంస్థలుండగా అందులో 84,072 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు 71,551 మంది విద్యార్థులకే స్కూల్‌ యూనిఫాంలు రాగా ఇంకా 12,521 మంది విద్యార్థులకు యూనిఫాంలు రాలే దు. పాఠశాల ప్రారంభం రోజునే ఒక యూనిఫాం అందజేయాలి. ఇప్పటి వరకు ఒక జతనే పూర్తి స్థాయిలో విద్యార్థులకు యూనిఫాంలను అందించలేదు.

పాఠశాలల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. బాలికలకు యూనిఫాం కుట్టించి ఇచ్చినప్పటికీ.. కొన్ని చోట్ల టాప్‌లు వస్తే ప్యాంట్లు రాలేదు. మరికొన్ని చోట్ల ప్యాంట్లు ఇస్తే టాప్‌ల ఆచూకీ లేకుండా పోయింది. అరకొర దుస్తులతో పాఠశాలలకు రాలేక, అలాగని వేరే దుస్తులు వేసుకోలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం.. బడులు తెరిచిన రోజే ప్రతీ విద్యార్థికి ఒక యూనిఫాం అందించాలి. రెండో జత స్వాతంత్య్ర దినోత్సవం రోజున పంపిణీ చేయాల్సి ఉంది. కానీ నాలుగు నెలలు కావస్తున్నా ఒక్క జత సైతం అందని పరిస్థితి ఏర్పడింది. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు దృషిసారించి అందరికీ యూనిఫాంలు అందే విధంగా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

క్లాత్‌ల వివరాలు...

మొత్తం వస్త్రం: 6,47,107 మీటర్లు

ఇప్పటి వరకు వచ్చింది: 4,53,165 మీటర్లు

ఇంకా రావాల్సింది: 1,93,942 మీటర్లు

వివరాలు తెప్పించుకుంటాం

ఇప్పటి వరకు ఒక్కో జత చొప్పున విద్యార్థులకు యూనిఫాంలు అంద జేశాం. ఎంఈఓల ద్వారా పూర్తి వివరాలు తెప్పించుకుంటాం. రాకపోతే వెంటనే అందించేందుకు ఏర్పాట్లు చేస్తాం.

– రమేశ్‌, ఇన్‌చార్జి డీఈఓ

సిద్దిపేట పట్టణం పారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు ప్యాంట్లు రాకపోవడంతో వివిధ రకాల లెగ్గిన్లను బాలికలు ధరిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో పారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 214 మంది విద్యార్థులుండగా అందులో బాలురులు 140, బాలికలు 74 మంది ఉన్నారు. బాలికలకు కేవలం టాప్‌లు మాత్రమే అందించారు. ప్యాంట్లు అందించకపోవడంతో

సాధారణ వివిధ రంగుల లెగ్గిన్‌లను ధరిస్తున్నారు. దీంతో యూనిఫాం ధరించి రావాలనే నిబంధన వర్తించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement