న్యాయవాదులపై దాడులను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

విధులు బహిష్కరించి నిరసన

చేర్యాల(సిద్దిపేట): న్యాయవాదులపై దాడులను అరికట్టాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆరెళ్ల వీరమల్లయ్య డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని నాగపురిలో న్యాయవాది గూడెపు శ్రీధర్‌ ఇంటిపై జరిగిన దాడిని నిరసిస్తూ చేర్యాల బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆరెళ్ల వీరమల్లయ్య మాట్లాడుతూ న్యాయవాది ఇంటిపై దాడిచేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట బార్‌ ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్‌, న్యాయవాదులు భూమిగారి మనోహర్‌, పొన్నం సురేష్‌, నల్గొండ సంతోష్‌, తాటికొండ ప్రణీత్‌, వెంకటేష్‌, పర్వతం రాములు, మోకు రాజిరెడ్డి, నీరటి రాజలింగం, దర్శనం ప్రశాంత్‌, అంకణి సురేందర్‌, బైరగోని ప్రసాద్‌, రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.

కేసు నమోదు

దాడికి పాల్పడిన వ్యక్తిపై కొమురవెల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు.

డ్రైనేజీల సమస్య

పరిష్కారానికి చర్యలు

డీఈ వెంకటేశం

దుబ్బాకటౌన్‌: డ్రైనేజీల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటేశం తెలిపారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో ఏఈ చందుతో కలిసి డ్రైన్లు, డివైడర్ల నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా అవసరమైన చోట్ల డివైడర్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలించి కొలతలు తీసుకున్నామని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనురాధ, ఉప సర్పంచ్‌ బాలకష్ణ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

హెల్త్‌కార్డు సేవలు

అందేలా చూడాలి

రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం

రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి

గజ్వేల్‌: పెన్షనర్లకు హెల్త్‌కార్డు సేవలు సక్రమంగా అందేలా చూడాలని ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం గజ్వేల్‌లో నిర్వహించిన రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రభుత్వం అందించిన హెల్త్‌ కార్డులపై చికిత్సలు నిర్వహించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. సమావేశంలో రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యం, ఫైనాన్స్‌ సెక్రటరీ రామకిష్టయ్య, గజ్వేల్‌ శాఖ అధ్యక్షులు నాగేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సుద్దముక్కలతో

సూక్ష్మ బొడ్డెమ్మలు

చేర్యాల(సిద్దిపేట): సుద్దముక్కలతో 5రకాల బొడ్డెమ్మల సూక్ష్మ రూపాలను తయారుచేసి సూక్ష్మ కళాకారుడు జక్కనపల్లి రాము తన అరుదైన ప్రతిభను చాటుకున్నారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాళ బొడ్డెమ్మలను రూపొందించారు. తెలంగాణ సంప్రదాయ పండుగలపై పిల్లలు, యువతలో ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో వీటిని తయారుచేసినట్లు రాము తెలిపారు. సూక్ష్మరూపాల్లో బొడ్డెమ్మలు ముద్దుగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement