అర్జీలు పునరావృతం కావొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతం కావొద్దు

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

కలెక్టర్‌ హైమావతి

కలెక్టర్‌ హైమావతి

సిద్దిపేటరూరల్‌: ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మళ్లీ పునరావృతం కాకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వచ్చే ప్రజలకు న్యాయం చేయాలన్నారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 85 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, శిక్షణ డిప్యూటి కలెక్టర్‌ భవ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పింఛన్‌ ఇప్పించండి సారూ..

నా పేరు మాచాపురం బాలవ్వ. మాది జాలిగామ గ్రామం. గజ్వేల్‌ మండలం. 70 సంవత్సరాలు నిండినా ప్రభుత్వం నుంచి పెన్షన్‌ రావడం లేదు. ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయాను. అధికారులు ఎలాగైనా పెన్షన్‌ అందించేలా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement