దశాబ్ది వేడుకలు ఉత్సాహంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

దశాబ్ది వేడుకలు ఉత్సాహంగా నిర్వహిద్దాం

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

● ప్రజలు భాగస్వాములు కావాలి ● జిల్లా చరిత్ర తెలిసేందుకే సంబురాలు ● 11న బహిరంగ సభ జయప్రదం చేద్దాం ● మాజీ మంత్రి హరీశ్‌రావు

9న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 10కె రన్‌. అనంతరం డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో యువజన సదస్సు. ఎన్జీవో భవన్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ, రిటైర్మెంట్‌ ఉద్యోగుల సదస్సు.

10న విపంచి ఆడిటోరియంలో కవి సమ్మేళనం. అనంతరం రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ లో వాణిజ్య, వ్యాపార వర్గాల సదస్సు. కోమటి చెరువు రూబీ నెక్లెస్‌ రోడ్డు మీద ఫుడ్‌ ఫెస్టివల్‌. లేజర్‌ షో. బతుకమ్మ సంబరాలు.

11న ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయడం. కేసీఆర్‌, హరీశ్‌రావు ఫ్లెక్సీలకు పాలా భిషేకం. అనంతరం సాయంత్రం 5గంటల కు హైస్కూలు మైదానంలో బహిరంగ సభ.

● ప్రజలు భాగస్వాములు కావాలి ● జిల్లా చరిత్ర తెలిసేందుకే సంబురాలు ● 11న బహిరంగ సభ జయప్రదం చేద్దాం ● మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటజోన్‌: ‘దశాబ్దాల కల అయిన ప్రత్యేక జిల్లా.. ఏర్పడి పదేళ్లు అయ్యింది. ఈ పండుగను ఉత్సాహంగా నిర్వహిద్దాం. ఇందులో జిల్లా ప్రజలను భాగస్వామ్యం చేయాలి. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ పట్టణ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటుతో పట్టణ స్వరూపం మారిపోయిందన్నారు. పదేళ్ల పండుగను ఘనంగా నిర్వహించాలన్నారు. సిద్దిపేట గురించి భావితరాలకు తెలిసేలా పండుగ సంబురాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దొంగ లెక్క దొడ్డిదారిన వెటర్నరీ కళాశాల కొడంగల్‌ తరలించారని, అదేవిధంగా మళ్లీ వెటర్నరీ కళాశాల వెనక్కి తేస్తానన్నారు. వచ్చేది మళ్ళీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని ధీమా వ్యక్తంచేశారు. జిల్లా ఆవిర్భావంతో కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనరేట్‌, అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, మెడికల్‌ కళాశాల, సుడా వచ్చాయని వాటి గూర్చి వివరించారు. సుదూరంలో ఉన్న సంగారెడ్డి వెళ్లే బాధ పోయిందన్నారు. అన్ని వర్గాలకు సిద్దిపేట జిల్లా ఏర్పాటు వల్ల మేలు జరిగిందన్నారు. ఈనెల 11న సిద్దిపేట పట్టణంలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌, సీనియర్‌ నాయకులు శర్మ, రాజనర్స్‌, వేణుగోపాల్‌ రెడ్డి, సంపత్‌ రెడ్డి, భూపేష్‌, వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబురాల షెడ్యూల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement