కొలువుదీరిన కొత్త పాలకవర్గం | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన కొత్త పాలకవర్గం

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

● చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ● రైతుల సంక్షేమానికి కృషి: చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి

● చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ● రైతుల సంక్షేమానికి కృషి: చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి

చేర్యాల(సిద్దిపేట): చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన చైర్మన్‌, డైరెక్టర్లు సోమవారం ప్రమాణ స్వీకారంచేసి, బాధ్యతలు చేపట్టారు. చైర్మన్‌ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బోయిని శ్రీనివాస్‌, డైరెక్టర్లతో మార్కెట్‌ కార్యదర్శి రవికుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ భాద్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జనగామ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. చేర్యాల మార్కెట్‌ కమిటీ పరిధిలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట, బచ్చన్నపేట, నర్మేట, తరిగొప్పుల ప్రాంతాల రైతులకు మార్కెట్‌ సేవలు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జీ, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ నూతన పాలకవర్గం నిత్యం అందుబాటులో ఉంటూ రైతుల సమస్యల పరిష్కరిస్తూ, వారి ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనగామ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బాలమణి శ్రీనివాస్‌, వివిధ మండలాల అధ్యక్షులు శ్రీనివాస్‌, భాస్కర్‌రెడ్డి, మల్లేశం, చేర్యాల పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్‌, కౌన్సిలర్లు ప్రసాద్‌, దుర్గయ్య, వివిద గ్రామాల సర్పంచులు రవి, రమేశ్‌, కొమురయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement