ఇంకా అద్దె భవనంలోనే విధులు | - | Sakshi
Sakshi News home page

ఇంకా అద్దె భవనంలోనే విధులు

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

● వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ● ప్రతి నెలా రూ.45 వేల అద్దె చెల్లింపు

● వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ● ప్రతి నెలా రూ.45 వేల అద్దె చెల్లింపు

సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం అదేశించినా ఇంకా అద్దె భవనంలోనే సిద్దిపేట వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కొనసాగుతోంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ఈ ఏడాది జనవరి 30 లోగా ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సర్కారు అదేశించింది. ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు చాలా వరకు కలెక్టరేట్‌లో కొనసాగుతు న్నాయి. మిగితా కొన్ని కార్యాలయాలను తరలించినా, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం మాత్రం తరలించ లేదు. అద్దె ప్రతి నెల రూ.45 వేలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం పొదుపు మంత్రం పాటిస్తున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క కార్యాలయానికే నెలకు రూ.45 వేల అద్దె చెల్లిస్తూ ఆదాయం వృథా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భవనంలోకి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement