వ్యాయామంతోనే ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యాయామంతోనే ఆరోగ్యం

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

ఎంపీ రఘునందన్‌ రావు

ఎంపీ రఘునందన్‌ రావు

మిరుదొడ్డి(దుబ్బాక): వ్యాయామంతోనే సకల ఆరోగ్యం సిద్ధిస్తుందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు. మండల పరిధిలోని కాసులాబాద్‌లో బుధవారం ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించారు. అలాగే వివిధ కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో ప్రశాంత జీవనం గడపాలంటే ప్రతి ఒక్కరు ఆరోగ్య సూత్రాలను పాటించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ అభివృద్ధిలో భాగస్వాములు కాకపోవడంతో రోడ్లు పురోగతి చెందడం లేదన్నారు. రోడ్లు మరమ్మతుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అమర్‌, సర్పంచ్‌ బాబాయ్‌, ఉప సర్పంచ్‌ రాజు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement