● పలు పాఠశాలల్లో వేడుకలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణ భాషా (మాండలిక) దినోత్సవాన్ని బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా విద్యార్థులు వివిధ రకాల తెలంగాణ మాండలికంకు సంబంధించిన ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు, తెలంగాణ భాష గొప్పతనాన్ని తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బోనాల పాటలు, శ్రీ కృష్ణ దేవరాయ భువన విజయం నాటకం, సోది.. రకరకాల అద్భుతమైన కవితలు ప్రదర్శించారు. కాళోజీ తెలంగాణ మాండలికం అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు.


