గొప్ప ప్రజాకవి కాళోజీ | - | Sakshi
Sakshi News home page

గొప్ప ప్రజాకవి కాళోజీ

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

సిద్దిపేటరూరల్‌: తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ తెలంగాణ ప్రజలను సామాజికంగా మేల్కొలిపిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ కొనియాడారు. బుధవారం కాళోజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను పద్మవిభూషన్‌తో గౌరవించిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి ఆధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భావితరాలకు స్ఫూర్తిని అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ సుదర్శన్‌రెడ్డి, బీసీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్‌, డీసీఎస్‌ఓ తనూజ, కలెక్టరేట్‌ ఏఓ రాజ్‌కుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement