ఏటీసీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఏటీసీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

ఇర్కోడ్‌ ఏటీసీ ప్రిన్సిపాల్‌ రామానుజ

సిద్దిపేటరూరల్‌: ప్రభుత్వ అడ్వాన్డ్‌స్‌ టెక్నాలజీ సెంటర్‌ ఇర్కోడ్‌లో స్పాట్‌ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎస్‌.రామానుజ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పదవ తరగతి పాసై, పై చదువులు మధ్యలో ఆపేసిన వారు అర్హులని, ఎలాంటి వయో పరిమితి లేదని తెలిపారు. దరఖాస్తుదారులు ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు www.iti.telangana. gov.inవెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌ 15 సీట్లు, ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ 11 సీట్లు, ఆర్టిసన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌ టూల్‌ 10 సీట్లు అందుబాటులో ఉన్నాయని, రెండు సంవత్సరాల అడ్వాన్స్‌ సీఎన్‌సీ మెషినింగ్‌ టెక్నీషన్‌ 2 సీట్లు, బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైర్‌ 19 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పదవ తరగతి మెమో, బోనాఫైడ్‌, కుల ధ్రువీకరణపత్రం, ఈ మెయిల్‌ ఐడీ, ఫొటో, ఫోన్‌ నంబర్‌తో ఇర్కోడ్‌ ఏటీసీ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.

వర్గల్‌కు ‘వైకుంఠ రథం’

వర్గల్‌(గజ్వేల్‌): తమ తండ్రి, దివంగత ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం వర్గల్‌ మాజీ సర్పంచ్‌ తూంకుంట గోపాల్‌రెడ్డి గ్రామానికి వైకుంఠ రథాన్ని వితరణ చేశారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆదివారం రథపూజలో పాల్గొని గ్రామానికి అంకితం చేశారు. అనంతరం దాతను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మోహన్‌, రంగారెడ్డి, ఉపసర్ప ంచ్‌ గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement