బెజ్జంకి(సిద్దిపేట)ః రూ.23 కోట్ల రూపాయల వేతనం తీసుకుంటూ అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెజ్జంకిలో ఆదివారం బీఆర్‌ఎస్, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. అనంతరం సహకార సంఘం చైర్మన్ దామోదర్, ఏఎంసీ చైర్మన్ కృష్ణలతో కలిసి ఆయన మట్లాడుతూ.. దళితుడు స్పీకర్‌గా ఉన్నాడని అసెంబ్లీకి రాని కేసీఆర్ దళితద్రోహని ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేతనంగా తీసుకున్న రూ.23 కోట్లను సీఎం సహాయ నిధికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మానకొండూర్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను విమర్శించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు, సర్పంచ్‌లు రత్నాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, రమేశ్, సంతోశ్, రాములు,నర్సింగం, సందీప్, శరత్, తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకిలో కాంగ్రెస్ నాయకుల భారీ ర్యాలీ


