బెజ్జంకి(సిద్దిపేట): ఆరుగ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. బెజ్జంకిలో మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతు కోసం ఆదివారం ప్లకార్డులతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వెయ్యి రోజుల్లో ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంస్కార హీనంగా మాట్లాడుతున్న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఉపాధ్యాయ వృత్తిని అగౌరవ పరిచినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, సర్పంచ్‌లు, నాయకులు శ్రీధర్, భీమయ్య, నిర్మల, కవిత, రాజయ్య, చంద్రకళ, లక్ష్మణ్, తిరుపతి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌గుప్త, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు.
మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్


