సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

గజ్వేల్‌: సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్‌లో టీఆర్‌ఎస్‌ఎంఏ(తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తమదైన శైలిలో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయులంటే తనకెంతో గౌరవమని, వారి సమస్యల పరిష్కారానికి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి మాట్లాడుతూ...ప్రైవేటు పాఠశాలలో యాజమాన్యాలు సంయుక్తంగా గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అభినందనీయమన్నారు.

ఎంపీ రఘునందన్‌రావు

టీఆర్‌ఎస్‌ఎంఏ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement