సన్నగా నొక్కేస్తుండ్రు | - | Sakshi
Sakshi News home page

సన్నగా నొక్కేస్తుండ్రు

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

న్యూస్‌రీల్‌

తిన్నగా నల్ల బజార్‌కు రేషన్‌ బియ్యం

ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

జిల్లా వ్యాప్తంగా 3,36,869 రేషన్‌ కార్డులుండగా వీరికి 6,583 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉచితంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున అందజేస్తున్నారు. ఆగస్టు నెలలో మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యం ప్రభుత్వం పంపిణీ చేసింది. గతంలో రేషన్‌ షాపుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో అందులో 70శాతానికి పైగా బ్లాక్‌ మార్కెట్‌కు చేరేవి. దీంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గతేడాది ఏప్రిల్‌ నెల నుంచి రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యంను పంపిణీ చేస్తోంది.

ఇంటింటికీ తిరుగుతూ..

రేషన్‌ బియ్యం కొనుగోలు చేసేందుకు రైస్‌ మిల్లర్లు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంటింటికి తిరిగి రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కిలోకు రూ.15 నుంచి రూ18ల వరకు కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైస్‌ మిల్లర్లకు రూ.25 నుంచి రూ.30లకు విక్రయిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ సమీపంలో చైనా బజార్‌ కేంద్రంగా రోజు రేషన్‌ బియ్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా రేషన్‌ బియ్యం ప్రతి నెలా లక్షలాది రూపాయలు లావాదేవీలు జరుగుతున్నాయి. చైనా బజార్‌లో రేషన్‌ బియ్యం దందా జరుగుతుందని రెవెన్యూ , పోలీసులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అలాగే జిల్లా సరిహద్దులైనా రాయపోలులో ఓ మిల్లు అడ్డగా రేషన్‌ దందా కొనసాగుతోంది. సీఎంఆర్‌ కింద అందించే బియ్యానికి బదులు రేషన్‌ బియ్యంనే అందజేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రేషన్‌ అక్రమ దందాను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై డీఎస్‌ఓ తనూజను ఫోన్‌ సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.

30శాతానికి పైగా పక్కదారి

సన్న బియ్యం చాలా మంది వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, కొందరు బయట విక్రయిస్తున్నారు. మొదట చాలా మంది సన్న బియ్యం విక్రయించకపోయినప్పటికీ బియ్యంలో 25శాతం వరకు నూకలు ఉండటం, అన్ని రకాల సన్నాలు మిక్స్‌డ్‌గా వస్తుండటంతో వాటిని 30శాతానికి పైగా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవడం లేదు.

పవర్‌ బ్యాంకులు మాయం

కిలోకు రూ.15పైగా లబ్ధిదారుల నుంచి కొనుగోలు

ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్న టీంలు

సిద్దిపేటలో చైనా బజార్‌ కేంద్రంగా రేషన్‌ దందా

చోద్యం చూస్తున్న రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు

ఇటీవల జరిగిన ఘటనలు..

రాయపోల్‌ మండలం రామవరంలోని మహాలక్ష్మి రైస్‌ మిల్లులో 400 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఈ నెల 2న తెల్లవారు జామున పట్టుకున్నారు.

ఆగస్టు 31న అక్బర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్‌ గ్రామ శివారులో ఉన్న బాలాజీ రైస్‌ మిల్లులో 188 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్టు 30న నంగునూరు మండలం రామచంద్రపూర్‌లో మోతె సాయిలు రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ ఉన్న 150 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని రాజగోపాల్‌పేట పోలీసులు పట్టుకున్నారు.

రేషన్‌ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తే.. పేదోళ్ల కడుపు నింపిన వాళ్లమవుతామన్న ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది నుంచి పంపిణీ చేస్తోంది. గతంలో దొడ్డు బియ్యం చాలా వరకు తినకుండా బయట విక్రయించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా దాదాపు 30శాతానికి పైగా జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. పలువురు ఇంటింటికీ తిరుగుతూ ‘బియ్యం కొంటాం... ’ అంటూ మైకులు పెట్టుకుని బహిరంగంగా తిరుగుతూ వినియోగదారుల నుంచి సన్న బియ్యం కొనుగోలు చేస్తూ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. అయినా పౌరసరఫరాలు, రెవెన్యూశాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement