కాంగ్రెస్‌ నేతలపై పీఎస్‌లో ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలపై పీఎస్‌లో ఫిర్యాదు

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

కాంగ్రెస్‌ నేతలపై పీఎస్‌లో ఫిర్యాదు

గజ్వేల్‌: మాజీ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితోపాటు వారి అనుచరులపై కేసు నమోదు చేయాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం గజ్వేల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను అగౌరవపరచడం సిగ్గుచేటన్నారు. గజ్వేల్‌లో కాంగ్రెస్‌ నేతల తీరు చూస్తుంటే వారు అధికారంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? అర్థం కావడంలేదన్నారు. వారం రోజుల్లో కాంగ్రెస్‌ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement