ల్యాప్‌టాప్ మాయంపై ఆరా
సిద్దిపేటజోన్: సిద్దిపేట బల్దియాలో ల్యాప్‌టాప్‌ల మాయంపై సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అరా తీసినట్లు తెలిసింది. బదిలీపై వెళ్లిన మెప్మా అధికారి ఒకరు ల్యాప్ టాప్ సరెండర్ చేయలేదని నిర్ధారణకు వచ్చిన అధికారులు సదరు మెప్మా అధికారికి నోటీసు జారీ చేశారు. అదేవిధంగా మరో ల్యాప్‌టాప్ బల్దియాలో బీరువాలో భద్రంగా ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా ల్యాప్ టాప్ గుట్టు రట్టు చేసేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు.


