దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠకు రండి | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠకు రండి

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠకు రండి కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోండి విద్యుత్‌ కోతలు నివారించాలని రైతుల ధర్నా నాగరాజుకు శిక్షా రత్న అవార్డు రోడ్డెక్కిన రైతులు

మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

మర్కుక్‌(గజ్వేల్‌): అంగడికిష్టాపూర్‌లో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ విషయమై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో అంగడికిష్టాపూర్‌ సర్పంచ్‌ కొండల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మర్కుక్‌ కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పాండుగౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ మంద బాల్‌రెడ్డి, నాయకులు తదితరులున్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌

సిద్దిపేటకమాన్‌: రాజీపడే కేసులను గుర్తించి సత్వరం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌ తెలిపారు. జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో న్యాయమూర్తి శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌లో రాజీ ద్వారా కేసులు పరిష్కరించడటం వల్ల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య తగ్గడంతో పాటు కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు జయప్రసాద్‌, సౌజన్య, ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు పాల్గొన్నారు.

చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యుత్‌ కోతలు నివారించాలని డిమాండ్‌ చేస్తూ మండల పరిధిలోని మాచాపూర్‌ రైతులు శనివారం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. త్రీఫేజ్‌ కరంట్‌ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియడం లేదని రైతులు ఆరోపించారు. రోజుకు వ్యవసాయానికి 8 గంటల విద్యుత్‌ సరఫరా కావడం లేదని, లోవోల్టేజీతో బోరుమోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ కోతలతో పంటలు ఎండుతున్నాయని వాపోయారు.

దుబ్బాక: విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ..విద్యార్థుల అభ్యున్నతికి కృషిచేస్తున్న లచ్చపేట మోడల్‌ స్కూల్‌ పీజీటీ సివిక్స్‌ ఉపాధ్యాయులు రాదారి నాగరాజు ప్రతిష్టాత్మకమైన శిక్షా రత్న అవార్డు–2026కు ఎంపికయ్యారు. విద్య, బోధన, కెరీర్‌ మార్గనిర్దేశం, కోచింగ్‌, అకాడమి క్‌ లీడర్‌షిప్‌ రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను నాగరాజు శిక్షా రత్న అవార్డు వరించింది. ఆదివారం హైదరబాద్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచిందన్నారు.

యూరియా కోసం

దుబ్బాకరూరల్‌: మండలంలోని చీకోడ్‌ గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. యాప్‌లో ఇబ్బందులు ఉండటం వల్ల బుక్‌ కావడం లేదని ఆరోపించారు. యూరియా కొరత వలన పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement