బీడీ కార్మికుల జీవనభృతిపై అసెంబ్లీలో మాట్లాడుతా.. | - | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికుల జీవనభృతిపై అసెంబ్లీలో మాట్లాడుతా..

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

బీడీ కార్మికుల జీవనభృతిపై అసెంబ్లీలో మాట్లాడుతా..

దుబ్బాక: బీడీ కార్మికుల జీవనభృతి రూ.4,016 అమలుచేయకపోవడంపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా 7 లక్షల మందికి పైగా బీడీ పరిశ్రమపై ఆధారపడి కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రూ.4,016 జీవనభృతి ఇస్తామని చెప్పి మూడేళ్లు అవుతున్నా అమలుచేయక పోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.భాస్కర్‌,సీఐటీయూ నాయకులు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా..వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ పంటకు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ శనివారం జిల్లా రూరల్‌ పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చింత రాజు, కూర వేణు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement