ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికపై జాప్యం జరుగుతుండటంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి అవార్డులు ఇవ్వడం ప్రతి ఏటా కొనసాగుతుంది. అయితే ఎంపిక సెప్టెంబర్ 5లోగా చేసి, ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటిస్తారు. కాని ఈసారి ఎంపికలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇంతవరకు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యాసంవత్సరం జిల్లా వ్యాప్తంగా 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తున్నారు. అందుకు గాను జిల్లా వ్యాప్తంగా 100 వరకు దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, మన జిల్లాలో ఇంత వరకు ఎంపిక కాకపోవడంపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం ఇవ్వని
అధికారులు
జిల్లాలో రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో విద్యావ్యవస్థ పూర్తిగా గడితప్పిందనే విమర్శలు ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదని ఉపాధ్యాయులే వాపోతున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక విషయమై విద్యాశాఖ అధికారులను ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
ఎంపికలో ఆలస్యం


