సహస్రం..హరిత వికాసం | - | Sakshi
Sakshi News home page

సహస్రం..హరిత వికాసం

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

సహస్రం..హరిత వికాసం

వర్గల్‌(గజ్వేల్‌): ఒకే రోజు 1000 కొబ్బరి చెట్లు..మెగా హరితహారం కార్యక్రమానికి వర్గల్‌ మండలం శేరిపల్లి గ్రామం వేదికగా నిలిచింది. శనివారం థామ్సన్‌ రైటర్స్‌, మ్యాజిక్‌ బస్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సహకారంతో ఈ మెగా కార్యక్రమం జరిగింది. రోడ్డు ఇరువైపులా, పెద్దమ్మ గుడి, బీరప్ప గుడి, పోచమ్మ గుడి, దొడ్డి కొమురయ్య విగ్రహం దగ్గర, వైకుంఠధామం తదితర చోట్ల కొబ్బరిచెట్లు నాటే ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ యెర్ర పావని, సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు భాగస్వాములయ్యారు. కొబ్బరిచెట్లు ఆదాయాన్ని, గ్రామ శోభను ఇనుమడింపజేస్తాయని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

శేరిపల్లిలో మెగా ప్లాంటేషన్‌

ఒకే రోజు 1000 కొబ్బరి మొక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement