సిద్దిపేట అర్బన్(సిద్దిపేట): భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి నా ఫెవరేట్ టీచర్. ప్రతి అంశాన్ని అర్థమయ్యే విధంగా బోధిస్తారు. పాఠాలతో పాటు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, జీవితంలో ఏది ముఖ్యం అనే విషయాలన చెబుతూ మోటివేట్ చేస్తారు. – వెంకట సాయి, 9వ తరగతి, ఎల్లుపల్లి
హెచ్‌ఎం జయప్రకాశ్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఆటోలో వచ్చిన విద్యార్థులు
వర్గల్(గజ్వేల్): నా పేరు వాంకార్ దత్త శ్రీపాద్. మాది వర్గల్ మండలం తున్కిఖాల్సా గ్రామం. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి ఇంగ్లిష్ మీడియం చదువుతున్న. పులి రాజు సార్ అంటే చాలా ఇష్టం. బయటకు తీసుకెళ్లి పొలాలు చూపుతో కార్యాలయాలు చూపుతూ అర్థమయ్యేలా పాఠాలు చెబుతారు. సారు చెప్పే పాఠాలు, సూచనలు, సలహాలు మా విద్యార్థులందరికీ ఎంతో ఇష్టం. నేను పాఠశాలలో పాడిన పాట జిల్లా స్థాయిలో ప్రశంసలు తెచ్చిపెట్టింది. అందుకు మా పులి రాజు సార్ ప్రోత్సాహమే కారణం.


