కాంగ్రెస్‌ శ్రేణుల బైక్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ శ్రేణుల బైక్‌ ర్యాలీ

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

కాంగ్రెస్‌ శ్రేణుల బైక్‌ ర్యాలీ

చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు. అల్లీపూర్‌ శివారులోని అనంతగిరి కట్టమైసమ్మ ఆలయం నుంచి చిన్నకోడూరు వరకు ర్యాలీ కొనసాగింది. ఏఎంసీ చైర్మన్‌ మీసం మహేందర్‌ మాట్లాడుతూ అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్న కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. నాయకులు పంతం శ్రీనివాస్‌, రాజేశ్‌, హరిబాబు, చంద్రశేఖర్‌, చందు, లక్ష్మి, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ చర్చకు సిద్ధం

చేర్యాల(సిద్దిపేట): జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల కాంగ్రెస్‌ నాయకులు విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన, కాంగ్రెస్‌ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్‌ విసిరారు. నేతలు మంజె మల్లేశం, మారేళ్ల భాస్కర్‌రెడ్డి, బండి శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీకాంత్‌, ఆగంరెడ్డి, సంజీవయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement