ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా స్థాయి సబ్ జూనియర్ యోగాసన పోటీల ఎంపికలు ఈ నెల 7న నిర్వహించనున్నట్టు జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు పెద్ది మనోహర్, గుడెపు మురళి కృష్ణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఉమాపార్థీవ కోటిలింగాల ఆలయ ఆవరణలోని /్ఞాన మందిరం లో జిల్లా స్థాయి పోటీలలలో రాణించిన యోగా క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఈ నెల 7న ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. యోగా పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తమ పేర్లను జిల్లా కార్యదర్శి మురళీకృష్ణను (8179250217, 9949453503) సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలన్నారు.


