చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఇది గుర్తించిన ఫిజికల్ డైరెక్టర్ ప్రవీణ్ మెలకువలు నేర్పించారు. పీడీ నేర్పించే అంశాలను రోజూ సాయంత్రం సాధన చేస్తున్నా. వాలీబాల్‌లో ఇప్పటి వరకు మూడు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందా. అలాగే జిల్లా స్థాయిలో అనేక సార్లు ప్రథమ బహుమతులు సాధించా. పీడీ ప్రవీణ్ ప్రోత్సాహంతో వాలీబాల్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తా. జిల్లాకు గుర్తింపు తీసుకువస్తా.
– కావటి అమూల్య,
9వ తరగతి, మోడల్ స్కూల్, ఇబ్రహీంనగర్


