కనులపండువగా కృష్ణాష్టమి | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా కృష్ణాష్టమి

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

కనులపండువగా కృష్ణాష్టమి

కృష్ణాజన్మష్టమి వేడుకలను శుక్రవారం జిల్లా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సుందర సత్సంగం, వేంకటేశ్వర, సంతోషిమాత తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉట్టి కొట్టేకార్యక్రమాలను చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. – ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)

మల్లన్న ఆలయంలో ..

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద పట్నం వేసి పూజలు చేశారు. ఆలయ ఒగ్గు పూజారులు శ్రీకృష్ణుడు, గొల్లబామ, రుక్మిణి వేషధారణలతో ఆలయ సంప్రాదాయం ప్రకారం ఉట్టి కొట్టారు. అనంతరం స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. పంచరంగులతో పట్నం వేసి బోనం సమర్పించి మల్లన్న కల్యాణం చేపట్టారు. స్వామి వారిని సీపీ రష్మీ పెరుమళ్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement