గౌరవెల్లి ప్రాజెక్టు వైఎస్సార్‌ ఆలోచనే.. | - | Sakshi
Sakshi News home page

గౌరవెల్లి ప్రాజెక్టు వైఎస్సార్‌ ఆలోచనే..

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

హుస్నాబాద్‌రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ వేయి రోజుల పాలన పై శుక్రవారం బీఆర్‌ఎస్‌ పందిల్లలో చేపట్టిన వంటవార్పు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు బాకీ పడిన పథకాలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కేసీఆర్‌ పాలనలో రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతు కుటుంబాలను అదుకున్నాయని, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదింటి అడపిల్లల పెళ్లిలకు అండగా నిలిచాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన వైఎస్సార్‌దే అయినా కేసీఆర్‌ ప్రాజెక్టు సామర్థ్యం పెంచి 99 శాతం పనులు పూర్తి చేయించి గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మెట్ట ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్‌ ప్రాజెక్టు ఎత్తు పెంచి 8 టీఎంసీల నీటి నిల్వ ఉండేందుకు నిధులు విడుదల చేసి పనులు చేయిస్తే కాంగ్రెసోళ్లు కోర్టులో కేసులు వేయించి అడుగడుగున పనులకు అడ్డపడ్డారని ఆరోపించారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌ పనులు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగడుగునా దగా చేస్తోందని ఆరోపించారు. ఎరువులు లేక నిత్యం హుస్నాబాద్‌ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించదన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట, ఎల్కతుర్తి, సైదాపూర్‌, భీమదేవరపల్లి, చిగురుమామిడి మండల బిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ప్రాజెక్టు సామర్థ్యం పెంచింది కేసీఆరే

పనులను అడ్డుకుంటోంది కాంగ్రెసోళ్లే..

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement