గజ్వేల్: ప్రతిపక్షనేతగా విఫలమైన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద చేస్తూ డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రజల సమస్యలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడున్న నేతలు కేసీఆర్‌ను ఇక్కడికి రప్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిపోయి.. అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లకాలంలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్కటైన కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించిందన్నారు. అసెంబ్లీకి, నియోజకవర్గానికి రాని కేసీఆర్ ఇప్పటికై నా రాజీనామా చేస్తే...కొత్త వారు ఎన్నికై ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
గజ్వేల్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం


