‘ఇండిగో’ పైలెట్‌గా గిరిజన బిడ్డ | - | Sakshi
Sakshi News home page

‘ఇండిగో’ పైలెట్‌గా గిరిజన బిడ్డ

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

‘ఇండిగో’ పైలెట్‌గా గిరిజన బిడ్డ 104 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

హుస్నాబాద్‌రూరల్‌: మండల పరిధి భల్లునాయక్‌తండాకు చెందిన గిరిజన విద్యార్థి లావుడ్య మనోజ్‌కుమార్‌ ఇండిగో ఎయిర్‌ సర్వీస్‌ పైలెట్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో సంతోషాలు వెల్లివిరిశాయి. తల్లిదండ్రులు లావుడ్య భిక్షపతి, గాయత్రి ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు మనోజ్‌కుమార్‌ ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన తర్వాత పైలెట్‌ శిక్షణ పొందారు. ఇటీవల పైలెట్‌ సెలక్షన్‌ ఇంటర్వ్యూలో మనోజ్‌కుమార్‌ ఎంపికై నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డి

రామచంద్రాపురం(పటాన్‌చెరు): 104 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా చెందిన 104 ఉద్యోగ సంఘం నాయకులు రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ..గత 18ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న 300మందిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. డీఎంఈ పరిధిలోని ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement