జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి
తొగుట(దుబ్బాక): పంటసాగు వివరాల కోసం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే జిల్లాలో ముమ్మరంగా సాగుతోందని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి తెలిపారు. మండలంలోని బండారుపల్లిలో డిజిటల్ క్రాప్ సర్వేను ఆమె మంగళవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ భూముల్లో ఏ పంట.. ఎంతవిస్తీర్ణంలో సాగుచేశారనే వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడానికి పంట నష్టం జరిగితే పరిహారం, బీమా పొందడానికి ఈ క్రాప్ బుకింగ్ డేటా అత్యంత కీలకమన్నారు. రాయితీ ఎరువులు, విత్తనాల కేటాయింపులకు కూడా ఇదే ప్రామాణికం కానున్నదని ఆమె తెలిపారు.


