వయోజన విద్య అడ్మిషన్లు పెంచండి | - | Sakshi
Sakshi News home page

వయోజన విద్య అడ్మిషన్లు పెంచండి

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఓపెన్‌ స్కూల్‌, వయోజన విద్య అడ్మిషన్లు పెంచాలని, జిల్లా ఇన్‌చార్జి డీఈఓ రమేశ్‌ అన్నారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో ఓపెన్‌ స్కూల్‌, వయోజన విద్య జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓపెన్‌ స్కూల్‌ వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రమేశ్‌ మాట్లాడుతూ ఓపెన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ రెగ్యులర్‌ సర్టిఫికెట్‌తో సమానంగా పరిగణిస్తారన్నారు. రెగ్యులర్‌గా పాఠశాల, కళాశాలలకు వెళ్లలేని వారు ఓపెన్‌ స్కూల్‌, వయోజన విద్యాను అభ్యసించాలన్నారు. కార్యక్రమంలో డీడీఏఈ వెంకట్‌రెడ్డి, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ వెంకట్‌స్వామి, అదనపు డీఆర్‌డీఓ సుధీర్‌, మోప్మా పీడీ హనుమంతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement