హక్కులపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

హక్కులపై అవగాహన అవసరం

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

చేర్యాల(సిద్దిపేట): బాలికలు తమ హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యదర్శి పద్మజ రమణ అన్నారు. సోమవారం చేర్యాల కేజీబీవీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ నరేందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం, పరిశుభ్రత, పౌష్టికాహారం, సైబర్‌ నేరాలు, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ శారద, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ చెరువు

సుందరీకరణకు రూ.3 కోట్లు

హుస్నాబాద్‌: ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు అదనంగా రూ.3 కోట్లు నిధులు మంజూరైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ తెలిపారు. ఈ నిధులతో కట్ట సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. త్వరలోనే ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, గ్లాస్‌ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కమిషనర్‌ పేర్కొన్నారు.

అధికారులకు జరిమానా

గజ్వేల్‌: సమాచారం ఇవ్వని కలెక్టరేట్‌ అధికారులకు జరిమానా విధించిన ఘటన ఆలస్యంగా తెలిసింది. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్‌ నిర్వాసిత కాలనీకి సంబంధించిన సమాచారం కోరితే కలెక్టరేట్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాష్ట్ర సమాచార కమిషన్‌ రూ.10వేల జరిమానా విధించిందని పిటీషనర్లు ఎండీ హయతొద్దీన్‌, సందబోయిన అశోక్‌, ప్రభాకర్‌లు సోమవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జూలై 20న వచ్చినట్లు చెప్పారు. తమ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సమాచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించామని పేర్కొన్నారు.

రైతు సమస్యలు పరిష్కరించాలి

చిన్నకోడూరు(సిద్దిపేట): రైతుల ఎదుర్కొంటు న్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం రైతు సమస్యలపై ఎంపీడీఓ జనార్దన్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యూ రియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగో లు చేయాలన్నారు. పంట నిల్వలకు గోదాము లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement