నీట్‌గా పీజీ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నీట్‌గా పీజీ పరీక్ష

Aug 31 2026 7:58 AM | Updated on Aug 31 2026 7:58 AM

229 అభ్యర్థులకు గాను 222 మంది హాజరు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని వెరిటాస్‌ అండ్‌ విర్టస్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ పరీక్ష కేంద్రంలో నీట్‌ పీజీ–2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఆరు గంటల నుంచే పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు చేరుకున్నారు. ఉదయం 8.30గంటల్లోపు అభ్యర్థులను లోపలికి అనుమతించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షను నిర్వహించారు. మొత్తంగా 229 మంది అభ్యర్థులకు గాను 222 మంది అభ్యర్థులు హాజరవ్వగా 7మంది అభ్యర్థులు గైర్హజరయ్యారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్‌ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సిద్దిపేట ఏసీపీ, ఇతర అధికారులు పరీక్ష నిర్వహణను పరిశీలించారు. పరీక్ష సెంటర్‌ వద్ద 108ను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సౌకర్యాలను కల్పించారు. దీంతో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

సిద్దిపేటఅర్బన్‌: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన నీట్‌ పీజీ పరీక్షకు 50 మందికి గాను 49 మంది హాజరయ్యారు. పరీక్షకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement