సీపీ రష్మీ పెరుమాళ్
పోలీసు కమిషనరేట్‌లో
జాతీయ జెండా ఆవిష్కరణ
జిల్లా అదనపు న్యాయమూర్తి
జయప్రసాద్
● కలెక్టర్ హైమావతి ● కలెక్టరేట్‌లో అవతరణ వేడుకలు
సిద్దిపేటరూరల్: దేశానికే ఆదర్శంగా అభివృద్ధిలో జిల్లా ముందుకు సాగుతోందని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అధికారులు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో దేశ స్థాయిలో ఏ అవార్డు ప్రకటించినా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, భవిష్యత్తులో కూడా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతం చేసేలా అధికారులందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రం
సిద్దిపేటకమాన్: ఎంతోమంది త్యాగాలు, సుదీర్ఘ పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు కమిషనరేట్‌లో సీపీ మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ..తెలంగా ణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో శాంతిభద్రతలను కాపాడుతూ కీలకపాత్ర పోషించిన పోలీసు వ్యవస్థ సేవలు మరువలేనివన్నారు. సిద్దిపేట ఏసీపీ, వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో పోలీసు అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుషాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్‌చంద్రబోస్, సీఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయవాదుల పాత్ర మరువలేనిది
సిద్దిపేటకమాన్: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించారని జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తి మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం అమరులైన వారిని స్మరించుకుందామన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు తరణి, సౌజన్య, కుమారస్వామి, ఏఓ ఇక్బాల్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.
‘కేంద్రం మాటలకే పరిమితమైంది’
సాక్షి, సిద్దిపేట: వడ్లు, మక్కలు, సన్ ఫ్లవర్ కొనుగోళ్లపై కేంద్రం మాటలకే పరిమితమైందని, రైతులు పండించిన పంటలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభిస్తున్నామని, ఈ పథకం ద్వారా కుటుంబానికి భరోసా ఇస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు గుర్తింపు, గౌరవం ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఖరీఫ్ ప్రారంభం నుంచే ప్రణాళికను రూపొందించి సన్న వడ్లు సాగు చేసే విధంగా అవగాహన కల్పిస్తామన్నారు. వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటే కార్యక్రమంకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం... మరికొన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయని వివరించారు.


