వడ్లు తెచ్చి నెల రోజులకుపైగా అవుతోంది. వాన పడితే ఆగమే. కాంటా పెట్టిన బస్తాలు సైతం లిఫ్ట్ చేయడంలేదు. నా వడ్లు కాంటా అయినా బస్తాలు మార్కెట్‌లోనే ఉన్నాయి. ఎప్పుడు వడ్లు పోతాయో ఏమో నిద్ర పడతలేదు.
–పాతూరి పెద్ద లక్ష్మారెడ్డి, రైతు, దుబ్బాక
ఇంకా కాంటా పెట్టలే..
వడ్లు తెచ్చి 25 రోజులు అవుతుంది. ఇంకా కాంటా పెట్టలే. సంచులు ఎప్పుడు ఇస్తరో తెలియడంలేదు. వాన పడితే కష్టమే. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని తొందరగా వడ్లు కొనేటట్లు చూడాలి.
– లక్ష్మణ్,రైతు
త్వరలోనే ప్రక్రియ పూర్తి చేస్తాం
జిల్లాలో ఇప్పటి వరకు 427 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 45,782 మంది రైతులకు రూ.713 కోట్ల డబ్బులు చెల్లించాం. ఇంకా సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. త్వరలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తాం.
–గోపాలకృష్ణ, డీఎం సివిల్ సప్లయ్


