దుబ్బాకరూరల్: ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహించిన రైతులు అక్బర్‌పేట–భూంపల్లి మండలం పోతారెడ్డిపేట జాతీయ రహదారిపై బైఠాయించారు. నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు కొంత తడిసి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు లారీలను వెంట వెంటనే పంపించి లిఫ్ట్ చేయాలన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళనను వరిమింపజేశారు. గంటకు పైగా ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి.


