గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా గణేశ్‌రెడ్డి నియమితులయ్యారు. తూప్రాన్ నుంచి బదిలీపై వచ్చి ఇక్కడ విధుల్లో చేరనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ వెంకటగోపాల్ బదిలీపై వెళ్లారు.
ముగిసిన టీజీపీఎస్‌సీ పరీక్షలు
వర్గల్(గజ్వేల్): గౌరారం కావేరి విశ్వవిద్యాలయంలో ఈనెల 23 నుంచి కొనసాగుతున్న టీజీపీఎస్‌సీ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు శనివారం ముగిశాయి. చివరి రోజు ఉదయం సెషన్‌లో 71 మందికి 57, మధ్యాహ్నం సెషన్‌లో 136 మందికి 113 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 170 మంది హాజరైనట్లు కావేరి వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు పేర్కొన్నారు.


