సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు సీఐలు బదిలీ అయ్యారు. సిద్దిపేట టూటౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న ఉపేందర్ హైదరాబాద్ రైల్వేకు, సిద్దిపేట ట్రాఫిక్ పీఎస్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్‌కుమార్ వరంగల్‌కు బదిలీ అయ్యారు. సిద్దిపేట టూటౌన్ నూతన సీఐగా హైదరాబాద్ వెయిటింగ్‌లో ఉన్న మర్రిపాక మురళి, సిద్దిపేట ట్రాఫిక్ నూతన సీఐగా గజ్వేల్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. ముత్యంరాజు నియామకమయ్యారు. సీసీఎస్ నూతన సీఐగా రంగాకృష్ణ నియామకమయ్యారు. ఈ మేరకు నూతన సీఐలు శనివారం బాధ్యతలు చేపట్టారు. బదిలీపై వెలుతున్న సీఐ ఉపేందర్‌ను పోలీసు సిబ్బంది ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.


