పదోన్నతితో మరిన్ని బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

పదోన్నతితో మరిన్ని బాధ్యతలు

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: పదోన్నతులు మరింత బా ధ్యతను పెంచుతాయని సీపీ రష్మీ పెరుమాళ్‌ పేర్కొన్నారు. శనివారం కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తూ పదోన్నతులు పొందిన పలువురు పోలీసు అధికారులను సీపీ కార్యాలయంలో ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఏఎస్‌ఐ నుంచి ఎస్‌ఐగా పదోన్నతి పొందిన నాగేశ్వర్‌రావు, జగదీశ్వర్‌, వెంకటరమణారెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐగా పదోన్నతి పొందిన కె.మురళి, రామ్‌ప్రసాద్‌, మధుసూదన్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ కుశాల్కర్‌, ఏఆర్‌ అదనపు డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు

విక్రయిస్తే కఠిన చర్యలు

దుబ్బాకటౌన్‌: ఎరువుల దుకాణాల డీలర్లు నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ మల్లయ్య హెచ్చరించారు. శనివారం పట్టణంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం పలు ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలకు సంబంధించిన లైసెన్స్‌లు, స్టాక్‌ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు లైసెన్స్‌ కలిగిన కంపెనీల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని, దుకాణాల ఎదుట ధరల పట్టికలు, స్టాక్‌ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీలర్లకు సూచించారు. విక్రయించిన వాటికి రశీదులు ఇచ్చి రైతుల సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెట ఏఓ ప్రియదర్శిని, ఎస్సై కీర్తిరాజు అన్నారు.

కల్యాణలక్ష్మి

చెక్కుల పంపిణీకి మోక్షం

గజ్వేల్‌: నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి పట్టిన రాజకీయ గ్రహణంపై ఈనెల 23న ‘సాక్షి’లో ‘చెక్కులు ఇవ్వరు.. చింత తీర్చరు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఈమేరకు ఆదివారం గజ్వేల్‌ ఐఓసీలోని ఆర్‌డీఓ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం జరగనుంది.

సమస్యలపై ఆరా

సిద్దిపేటజోన్‌: కేసీఆర్‌ నగర్‌ గ్రంథాలయంలో సమస్యలను శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రం అడిగి తెలుసుకున్నారు. పాఠకుల కోరిక మేరకు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకుడు నాగరాజు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement