సిద్దిపేటరూరల్: కిశోర బాలికలు చదువుతో పాటుగా అన్న రంగాల్లో ముందుకు సాగేలా ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్యా అన్నారు. శనివారం మహిళా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కిశోర బాలికల మాక్ పార్లమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు విద్య, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, సమాజ నిర్మాణంలో తమ పాత్రను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. బాలికలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బాలల హక్కులు, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలికలను అధికారులు అభినందించి, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు అదనపు డీఆర్‌డీఓ రోనాల్డ్ సుధీర్ కుమార్, డీడబ్ల్యూఓ శారద, డీఎంహెచ్‌ఓ ధనరాజ్, ఏటీసీ ప్రిన్సిపాల్, ఎన్జీఓ ప్రతినిధులు, సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్యా


