సిద్దిపేటరూరల్: సంబంధిత అధికారులంతా సమన్వయంతో పనిచేసి జూన్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్సుహాల్‌లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సివిల్ సప్లై, డీఆర్డీఓ, పీఏసీఎస్, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో అదనపు కలెక్టర్ లకీ్‌ష్మ్ కిరణ్‌తో కలిసి శనివారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఎంత ధాన్యం ఉంది, పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా గోదాంలను అన్వేషించి అందులో ధాన్యం దిగుమతి చేయించాలని ఏపీఎంలను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి తనూజ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్డిఓ సదానందం, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి


