● ఘనంగా జయంతి ఉత్సవాలు
● శ్రీరామ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అన్ని హనుమాన్ ఆలయాలలో మంగళవారం భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారులు దీక్ష విరమించారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.
పంచవటిలో హరీశ్‌రావు పూజలు
జిల్లా కేంద్రం రంగధాంపల్లిలోని పంచవటి హనుమాన్ ఆలయంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు, అర్చకులు హరీశ్‌రావుకు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు.


