● కానిస్టేబుల్ ప్రవీణ్, భార్య రజిత ఇద్దరు కలిసి స్థల విక్రయం గురించి మాట్లాడుదామని ఈ నెల 2న కారులో వ్యాపారి విశ్వనాథంను తీసుకెళ్లారు. అతన్ని హత్య చేసి ఒంటిమీద ఉన్న 10తులాల బంగారు నగలను తీసుకుని మృతదేహాన్ని ఇమాంబాద్ కాలువ వద్ద పడేశారు. అంతకంటే ముందు వీరు గత నెల 25న బొడ్డు నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకుని ఏమార్చి సుమారు మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు దొంగిలించారు.
● ఏప్రిల్ 30న బస్సులో రద్దీని ఆసరాగా చేసుకుని నాగమణి అనే మహిళ అస్వస్థకు గురైనట్లు నటించి పక్కనే ఉన్న మహిళ బ్యాగులోంచి ఏడున్నర తులాల బంగారు నగలను అపహరించింది. వెంటనే సదరు మహిళ చేర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
● ఈ నెల 11న చేర్యాల పట్టణం గట్టుతోటలో పిట్టల శ్రీనివాస్ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 5 తులాల బంగారం నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.
● మెదక్ జిల్లా ఏడుపాయల టీ జంక్షన్ సమీపంలో చేపల దుకాణాన్ని బోల ఎగొండ–లావణ్యలు నడుపుతున్నారు. ఈ నెల 11న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నారు. స్కూటీ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి లావణ్య మెడలో ఉన్న పుస్తెలతాడు తెంపుకొని పరారయ్యారు.


