● ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ● దుబ్బాకలో హిందూ మహాసమ్మేళనం
దుబ్బాక: పాశ్చత్యసంస్కృతి మోజులో పడి మన హిందూ ధర్మాన్ని మరచిపోవద్దని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. శనివారం రాత్రి దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఆలయంలో హిందూ మహాసమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా హిందూ ధర్మాన్ని అనుసరిస్తుంటే మనం దూరం అవుతుండడం బాధాకరమన్నారు. హిందూ ధర్మం ప్రపంచానికే నడవడిక నేర్పిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే గొప్పగా నిలిచిందన్నారు. హిందువుగా పుట్టడడం మన అదృష్టమన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మ రక్షణకు ప్రతి భారతీయుడు పాటు పడాలన్నారు. దుబ్బాకలో హిందు మహా సమ్మేళనం ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ జీ, హిందూ ఽమహాసమ్మేళనం అధ్యక్షులు చింత రాజు, వడ్లకొండ శ్రీధర్, రొట్టె రాజమౌళి తదితరులు ఉన్నారు.


