త్వరలో గ్రామ కమిటీలు | - | Sakshi
Sakshi News home page

త్వరలో గ్రామ కమిటీలు

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

త్వరలో గ్రామ కమిటీలు

టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత

సిద్దిపేటకమాన్‌: త్వరలోనే సిద్దిపేటకు వచ్చి గ్రామ గ్రామాన పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం సిద్దిపేటలోని అంబేడ్కర్‌ విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని.. సిద్దిపేట ప్రజలు తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆదరించాలని కోరారు.

సామాజిక న్యాయం కోసమే ..

మిరుదొడ్డి(దుబ్బాక): బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించడం కోసమే టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రక్షణ సేన) రాజకీయ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలోని లక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీని రానున్న కాలంలో మరింత బలోపేతం చేసి ప్రజల సేవలో భాగస్వాములమవుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement