న్యూస్‌రీల్
రెచ్చిపోతున్న గ్రామసింహాలు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలో వీధి కుక్కలుస్వైరవిహారం చేస్తున్నాయి. వివరాలు 8లో u
ఉండేనా..
గజ్వేల్‌లోని ఈఎన్‌సీ
కార్యాలయాల సముదాయం
ఏడాదిగా ఈఎన్‌సీ పోస్టు ఖాళీ
పదేళ్లపాటు అధికారంలో ఉన్న అప్పటి సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికే నమూనాగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. ప్రత్యేకించి సాగునీటి పారుదలశాఖ(ఇరిగేషన్)కు సంబంధించి మరో అడుగు ముందుకేసి.. ఈ ప్రాంతాన్ని ఈఎన్‌సీ కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేశారు. దీనివల్ల ఈ కార్యాలయం జిల్లాతోపాటు తెలంగాణలోని జనగామ, యాదాద్రి, మెదక్, మేడ్చల్ తదితర జిల్లాలకు ప్రధాన ఆధారంగా మారింది. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లకు ఇక్కడ ఈన్‌ఎసీగా పనిచేసిన హరేరామ్ కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు.. ఈ ప్రాంతంలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను పూర్తి చేయడం, కాల్వల నిర్మాణం చేపట్టడంలో ఇక్కడి ఇరిగేషన్ శాఖ అధికారులు బిజీబిజీగా గడిపారు.
ఏడాదికాలంగా మారిన సీన్..
ఏడాది కిందట ఇక్కడి ఈఎన్‌సీ హరేరామ్ ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయన విచారణను ఎదుర్కోవడం వల్ల.. ఇక్కడికి కొత్త ఈఎన్‌సీ రాలేదు. దీనివల్ల ఇక్కడ ఈఎన్‌సీ పోస్టు కొనసాగుతుందా? లేదా..? అనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం ఇక్కడ సీఈ, ఎస్‌ఈతోపాటు ముగ్గురు ఈఈలు ఉండగా, డీఈ, ఏఈల పోస్టులు చాలావరకు ఖాళీలు ఉన్నాయి.
ఎక్కడి పనులు అక్కడే..
గతంలో ఈఎన్‌సీ కార్యాలయంగా ఉన్న గజ్వేల్‌లో పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అంశాలు చాలా వేగంగా జరిగేవి. ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లకు సంబంధించిన ప్రధాన కాల్వలు, పంపిణీ కాల్వలు, ఉప కాల్వలకు సంబంధించి ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏళ్లతరబడి ఈ పనులన్నీ సాగకపోవడం వల్ల సాగునీటి పంపిణీ సమస్యగా మారుతోంది. జిల్లాలోనే కాదు.. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రధాన కాల్వల పనులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని జిల్లాలకు ఇంకా గోదావరి జలాలు అందలేదు. ఇకపోతే పంపిణీ కాల్వల సమస్య తీవ్రంగా ఉంది. ఉప కాల్వలకు సంబంధించిన కార్యాచరణ ముందుకుసాగకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఇక్కడికి ఈఎన్‌సీ పంపడం ద్వారా పనులు గాడిన పడేలా చేస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే.


